Chennai | చెన్నైలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రోజుల కిందటే చెన్నైను వణికించిన వర్షం… మళ్లీ నేడు వణికించింది. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి వర్షం దంచి కొట్టింది. దీంతో చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించారు అధికారులు. మరీనా బీచ్, పట్టినపక్కం, ఎంఆర్సీ నగర్, నందనం, మైలాపూర్తో సహా పలు ప్రాంతాల్లో చల్లటి గాలులతో కూడిన వర్షం కురిసింది. అయితే ఎంఆర్సీ నగర్లోనే అత్యధికంగా వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు చెన్నై, తిరువళ్లూరు, కంచీపురం, చెంగళ్పట్టు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.