న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తూర్పు ప్రాంతాల్లో కొన్ని చోట్ల విస్తారంగా, కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు ఇవాళ భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. తెలంగాణతో పాటు దక్షిణ చత్తీస్ఘడ్, విదర్భ ప్రాంతాల్లో ఇవాళ, రేపు జోరుగా వానలు కురవనున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, అది మరో రెండు మూడు రోజుల్లో వాయవ్య దిశగా వెళ్తుందని వాతావరణశాఖ చెప్పింది.
గుజరాత్ తీరం నుంచి కేరళ తీరం వరకు కూడా ఏకధాటిగా వర్షాలు కురవనున్నాయి. పశ్చిమ తీరం మొత్తం అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐంఎడీ తన ట్విట్టర్లో తెలిపింది. కొంకన్తో పాటు గోవా, మధ్య మహారాష్ట్ర, కోస్టల్ కర్నాటక ప్రాంతాల్లోనూ ఇవాళ, రేపు భారీ వర్షాలు ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇవాళ, రేపు.. ఆ తర్వాత 25, 26 తేదీల్లోనూ అత్యధిక స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో 26వ తేదీ తర్వాత విస్తారంగా వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
Increase in rainfall activity over northeast India likely from 26th July onwards with fairly widespread to widespread rainfall with isolated heavy to very heavy falls over these areas.
— India Meteorological Department (@Indiametdept) July 22, 2021
For more details, kindly visit: https://t.co/FgQn5EcVnb@moesgoi @ndmaindia pic.twitter.com/VL134jfyxx