సోమవారం 30 నవంబర్ 2020
National - Sep 23, 2020 , 06:43:50

ముంబైలో భారీ వర్షం

ముంబైలో భారీ వర్షం

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురిశాయి. సియాన్, గోరేగావ్ సహా కొన్ని ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. సియాన్ రైల్వేస్టేషన్‌ వరద నీటిలో చిక్కుకుంది. ట్రాక్‌ మొత్తం నీటిలో మునిగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం.. శివారు ముంబైలో మంగళవారం వర్షపాతం 23.4 మిల్లీ మీటర్లు కురవగా.. సాధారణ వర్షపాతం నుంచి 129 శాతం పెరిగింది. బుధవారం ముంబై మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముంబైలో గరిష్ఠ ఉష్ణోగ్రత బుధవారం 32 డిగ్రీల సెల్సియస్‌, కనిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. వర్షానికి రైల్వే ట్రాక్‌లపైకి వరద చేరడంతో సియోన్‌-కుర్లా, చునాభట్టి-కుర్లా మధ్య సబర్బన్‌ రైళ్ల సేవలను నిలిపివేస్తున్నట్లు సెంట్రల్‌ రైల్వే తెలిపింది. షటిల్ సేవలు థానే-కళ్యాణ్, వాషి - పన్వెల్ మధ్య నడుస్తాయని పేర్కొంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.