న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం (heavy rains) కురింసింది. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం శుక్రవారం రాత్రి ప్రారంభమమై శనివారం ఉదయం వరకు పడింది. దీంతో చాణక్యపురి, తూర్పు ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.
కాగా, ఢిల్లీ-ఎన్సీఆర్, పరిసర ప్రాంతాల్లో శనివారం ఒక మోస్తరు నుంచి ఉరుములతో వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, మనేసర్, బల్లభ్‌గఢ్, కర్నాల్, పానిపట్, గన్నౌర్, సోనిపట్, ఖార్ఖోడా, ఝజ్జర్, సొహానా, పల్వాల్, హర్యానాలోని నుహ్, ఉత్తరప్రదేశ్‌లోని బరౌత్, బాగ్పట్, రాజస్థాన్‌లోని తిజారా పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నదని తెలిపింది.
08/01/2022: 04:55 IST; Thunderstorm with moderate to heavy intensity rain would occur over and adjoining areas of entire Delhi and Delhi ( ), NCR ( Gurugram, Faridabad, Manesar, Ballabhgarh) Karnal, Panipat, Mattanhail, Jhajjar, Farukhnagar, Kosali, Rewari, Bawal, Nuh (Haryana)
— India Meteorological Department (@Indiametdept) January 7, 2022