మహిళలు ఈ ఐదు రకాల న్యూట్రియన్లు తప్పకుండా తీసుకోవాలి...!

హైదరాబాద్ :ఇటీవల చేసిన అధ్యయనాల ప్రకారం చాలా మంది మహిళల్లో కొన్నినూట్రియన్ల కొరత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ప్రతి మనిషికి పోషకాహారం తప్పనిసరి. మనం రోజూ తినే ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు తప్పక ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్లు వారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించి, వారు తినే ఆహారంలో ముఖ్యంగా ఐదు రకాల న్యూట్రియన్లు ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
-విటమిన్-బి12
ఆడవారికి చాలా ముఖ్యమైన న్యూట్రియన్లలో ఒకటి.. విటమిన్-బి12. ఇది చాలా మందికి తెలియనప్పటికీ.. ఎక్కువమందిలో దీని కొరత ఉంటున్నట్లు స్టడీలో తేలింది. అయితే.. విటమిన్-బి12 కొరత కారణంగా.. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడంతో పాటు.. రక్త కణాలు సరైన ఆకారంలో పెరగవు. దీంతో పాటు విటమిన్-బి12 కొరత కారణంగా నరాల పనితీరు తగ్గుతుంది. మాంసం, కోడి, గుడ్డు, పాలు, పాలపదార్థాలు తినడం వల్ల శరీరానికి విటమిన్-బి12 అందుతుంది. అందుకనే ఇది శరీరానికి చాలా ముఖ్యమైన న్యుట్రియన్గా మారింది.
-విటమిన్-డి
రకరకాల విటమిన్లు ఉన్నప్పటికీ మనిషికి చాలా అవసరమైనది విటమిన్-డి. ఇది యుముకలకు క్యాల్షియం అందించేందుకు ఉపయెగపడుతుంది. మనిషి శరీరం స్వయంగా ఈ పనిని చేసుకోలేదు. కాబట్టి దీనికి కచ్చితంగా విటమిన్-డి సహాయం చేస్తుంది. దీంతో పాటుగా విటమిన్-డి ఆడవారిలో సెక్స్ హార్మోన్లకు సహాయపడుతుంది. ఇది శరీరానికి సరిపడా లేకపోతే.. ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గి.. నెలసరి సరిగా రాకపోవడంతో పాటు.. జననేంద్రియాల దగ్గర రకరకాల సమస్యలను వస్తుంటాయి. ఆయిలీ ఫిష్, మాంసం, కోడిగుడ్డు పచ్చసొన లాంటి పోషకాహారాలు తీసుకుంటే విటమిన్-డి కొరత తగ్గుతుంది.
-మెగ్నీషియం
ఐరన్‌తో పాటు చాలా మంది స్త్రీలు మెగ్నీషియం కొరతతో బాధపడుతున్నారు. ఇది సరైన కండాలతో పాటు గుండె మరియు నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతోపాటు.. రక్త నాళాలు, కండరాల కణజాలం, బ్రెయిన్, జీర్ణాశయాలపై ఒత్తిడి పడకుండా కాపాడుతుంది. అందుకనే ఇది శరీరానికి చాలా ముఖ్యమైన న్యుట్నియన్గా మారింది. మెగ్నీషియం కొరత కారణంగా కలిగే మలబద్ధకం, తిమ్మిరి లాంటి వాటి నుంచి బయటపడాలంటే.. బచ్చలికూర, చిక్కుళ్ళు, కాయలు, విత్తనాలు తృణధాన్యాలు లాంటివి మీ ఆహారంలో ఉండేలా చూసుకొండి.
- క్యాల్షియం
శరీరంలో యముకలకు చాలా అవసరమైనది క్యాల్షియం. ఇది యుముకలకు బలం చేకూర్చి .. శరీరంలోని ఇతర అంతర్గత అవయవాలను కాపాడేందుకు సహాయపడుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు గర్భధారణ తర్వాత మొకాళ్ల నొప్పుడు, నడుము నొప్పి లాంటి వాటిని ఎదుర్కొంటున్నారు. వీటిని అధిగమించేందుకు క్యాల్షియం తప్పనిసరి అని నిపుణులు అంటున్నారు. పాల పదార్థాలు, ఆకు కూరలు, సోయా ప్రాడక్స్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి.
- ఐరన్
భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఆడవాళ్లు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ అందించేందుకు ఐరన్ ఉపయోగపడుతుంది. దీని కొరత ఉండం వల్ల బలహీనం, నీరసం, బద్దకం లాంటి సమస్యలకు గురవుతారు. ముఖ్యంగా నెలసరి సమయంలో రక్తం కోల్పోతుంటారు కనుక.. ఐరన్ కొరత ఉండకుండా చూసుకొండి. వర్కౌట్ చేయడం, స్పోర్ట్స్‌లో పాల్గొనే స్త్రీలలో ఐరన్ కొరత ఎక్కువగా కనపడుతుంటుంది. డ్రై ఫ్రూట్స్, కిడ్నీ బీన్స్, మాంసం, తృణధాన్యాలు తినడం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ : 400 మంది బాలికలకు బెదిరింపులు
- మరో బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ చిత్రం..2022లో సెట్స్ పైకి!
- పాలనలో పారదర్శకత కోసమే ప్రజావేదిక : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- వుహాన్‌లో డబ్ల్యూహెచ్‌వో బృందం.. ముగిసిన క్వారెంటైన్
- మైనర్ ప్యాంటు జిప్ తీయడం లైంగిక దాడి కాదు: బాంబే హైకోర్టు
- పీఎన్బీలో సెక్యూరిటీ మేనేజర్ పోస్టులు
- వివాహితకు వేధింపులు.. యువకుడు అరెస్ట్
- బీజేపీ వెబ్సైట్ : ఎంపీని హోమోసెక్సువల్‌గా చిత్రించారు
- కొడుకు 10 కోట్లు డిమాండ్.. అసభ్యకర చిత్రాలతో బెదిరింపులు
- అనసూయ మూవీ ట్రైలర్ విడుదల చేయనున్న వెంకీ