జైపూర్ : ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ పరిపాలనా అధినేత్రి, రాజయోగిని దాది రతన్ మోహిని (101) అహ్మదాబాద్‌లోని దవాఖానలో మంగళవారం కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు గురువారం జరుగుతాయని బ్రహ్మకుమారీస్ సంఘం తెలిపింది. ఆమె మృతికి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, రాజస్థాన్ గవర్నర్ హరిభావు బాగ్డే, ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సంతాపం వ్యక్తం చేశారు. రతన్ మోహిని మరణం తీవ్రంగా బాధించిందని రాష్ట్రపతి అన్నారు. తన బోధనలు, సేవల ద్వారా అనేక మంది జీవితాల్లో ఆమె మార్పు తీసుకొచ్చిందని కొనియాడారు. బ్రహ్మకుమారీల పరిపాలనా అధిపతిగా, ఆమె జీవితం దైవిక అంకితానికి నిదర్శనమని బ్రహ్మకుమారీస్ సంఘం పేర్కొంది.