HD Kumaraswamy : కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పాలక, విపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూర్‌లోని జేడీఎస్ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పలు వ్యాఖ్యలు చేశారు.
సిద్ధరామయ్య ప్రభుత్వం వైఫల్యాలు, తప్పిదాల గురించి తాను మాట్లాడితే 2007 మైనింగ్ కేసులో తన ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని ప్రభుత్వం గవర్నర్‌ను కోరుతున్నదని వ్యాఖ్యానించారు.కాగా, కర్నాటక గవర్నర్‌ను కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారని కాషాయ నేతలు చేస్తున్న విమర్శలపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు.
గవర్నర్‌ను తాము ప్రశ్నిస్తే అవమానించినట్టా అని నిలదీశారు. శశికళా జొల్లె, మాజీ మంత్రి మురుగేష్ నిరాని, జనార్ధన రెడ్డిపై ఫిర్యాదులున్నాయని సీఎం తెలిపారు. వీరిని ప్రాసిక్యూట్ చేసేందుకు తాము గవర్నర్‌ను కోరినా పర్మిషన్ ఇవ్వలేదని వివరించారు. గవర్నర్ పదవి అనేది రాజ్యాంగబద్ధమైనదని, రాష్ట్రపతి ప్రతినిధిగా ఆయన పనిచేయాలని, కేంద్రం ప్రతినిధిగా వ్యవహరించరాదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కాగా ముడా స్కామ్‌లో కర్నాటక సీఎం సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర గవర్నర్ అనుమతించడం కర్నాటక రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే.
Read More :
Road Accident | తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులతో పాటు మహిళ మృతి