Road Accident | ఏపీలోని అనంతపురం జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. తాడిపత్రి మండలం వంగునూరు సమీపంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలోనే మృతి చెందింది. మృతులను తాడిపత్రికి చెందిన ప్రతాప్‌రెడ్డి (25), ప్రమీల (22) దంపతులతో పాటు మరో మహిళ వెంకటలక్ష్మిగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారు కడప నుంచి తాడిపత్రికి వస్తున్నది. ఈ క్రమంలో వంగునూరు సమీపంలోకి ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.