HD Kumaraswamy : ఎన్డీయే కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. ముడా, వాల్మీకి స్కామ్‌లపై సిద్ధరామయ్య సర్కార్‌కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన బెంగళూర్-మైసూర్ పాదయాత్రపై నీలినీడలు పరుచుకున్నాయి. పాదయాత్రపై ఎన్డీయే సంకీర్ణ సర్కార్ భాగస్వామి, జేడీఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమను బీజేపీ పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయం తీసుకుంటే తామెందుకు వారికి మద్దతు ఇవ్వాలని జేడీఎస్ నేత, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రశ్నించారు.
పాదయాత్ర విషయంలో వారు తమ పట్ల ఎలా వ్యవహరించారు..వారేం సాధించడానికి ప్రయత్నిస్తున్నారని నిలదీశారు. బీజేపీ తీరు తనను బాధపెట్టిందని ఆయన పేర్కొన్నారు. ప్రీతం జే. గౌడ ఎవరు..హెచ్డీ దేవెగౌడ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారిలో ఆయన ఒకరని, ఆయనను బీజేపీ నేతలు తీసుకొచ్చి తనపక్కన కూర్చోపెట్టారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రజ్వల్ రేవన్ణ కేసులో ఆ పెన్‌డ్రైవ్‌ల పంపిణీకి బాధ్యులెవరు..హసన్‌లో జరిగిందంతా బీజేపీకి తెలియదా అని కుమారస్వామి అసహనం వ్యక్తం చేశారు. కాగా ముడా, వాల్మీకి స్కామ్‌ల విషయంలో సిద్ధరామయ్య నేతృత్వంలోకి కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పాదయాత్రను చేపట్టేందుకు సంసిద్ధమైంది. పదిరోజుల పాటు సాగే పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ అగ్రనేతలను రప్పించేందుకు కాషాయ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
Read More :
Condom | కండోమ్‌తో జాగ్రత్త.. వంధ్యత్వం, క్యాన్సర్ రావొచ్చు..!