Chappal Holi | హోలీ అంటే ఏంటి.. రంగులు చల్లుకోవడం.. హోలీ పండుగ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అంటారు. కానీ.. ఒకచోట మాత్రం హోలీ అంటే చెప్పులతో కొట్టుకోవడం. అవును.. మీరు నమ్మినా.. నమ్మకపోయినా అది నిజం. చెప్పులతో ఒకరిని మరొకరు కొట్టుకొని అక్కడ హోలీ వేడుకలు జరుపుకుంటారు.
బీహార్‌లోని పాట్నాలోనే ఈ వింత ఆచారం ఉండేది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో హోలీ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈనేపథ్యంలో పాట్నాలో కూడా హోలీ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. పాట్నాలోని వాటర్ పార్క్‌లోకి వెళ్లిన స్థానికులు.. అక్కడ ఉన్న నీళ్లను రంగులతో నింపేశారు. ఆ తర్వాత ఇక ఆ నీళ్లలోకి దిగి.. అందరూ ఒకరిని మరొకరు చెప్పులతో కొట్టుకున్నారు. ఎవ్వరినీ వదలకుండా.. ఏ చెప్పు దొరికితే ఆ చెప్పుతో ఎదుటి వాళ్లను బాదుతారు. ఇక.. చెప్పుల దెబ్బలు తినలేక కొందరు అక్కడి నుంచి పరిగెత్తడం.. వాళ్లను పట్టుకునేందుకు రంగులు కలిపిన నీళ్లలో పరిగెత్తడం.. ఇదంతా హోలీ సెలబ్రేషన్స్‌లో భాగమే.
అయితే.. చెడు మీద మంచిని జయించిన సందర్భంగా రంగులతో ఈ ఫెస్టివల్ జరుపుకుంటారు కాబట్టి.. మనలో ఉన్న చెడు కూడా పోవాలని.. మనలో మంచి ఉండాలని చెప్పులతో ఒకరిని మరొకరు కొట్టుకుంటారట.
#WATCH पटना : वाटर पार्क में होली के जश्न के दौरान लोग एक-दूसरे पर चप्पल फेंकते दिखे। pic.twitter.com/eFAY65wsU7
— ANI_HindiNews (@AHindinews) March 17, 2022
తాజాగా.. పాట్నాలో జరిగిన ఈ చెప్పుల హోలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా చాలా వింతగా ఈ సంప్రదాయంపై రెస్పాండ్ అవుతున్నారు. అయితే.. ఇలా వినూత్నంగా.. వింతగా హోలీ వేడుకలు జరుపుకోవడం ఒక్క పాట్నాలోనే కాదు.. మహారాష్ట్రాలోని బీడ్ జిల్లాలో కూడా అలాంటి వేడుకలే జరుగుతాయి. అక్కడ కొత్త అల్లుడిని హోలీ రోజు గాడిద మీద ఊరేగిస్తారట. తన కూతురుకు పెళ్లి చేసిన ఏ తండ్రి అయినా.. పెళ్లి తర్వాత వచ్చే తొలి హోలీ రోజున కొత్త అల్లుడిని ఇంటికి పిలిచి.. గాడిద మీద ఊరేగిస్తారట. ఈ సంప్రదాయం బీడ్ జిల్లాలోని విదా అనే గ్రామంలో ఉంది.
😂😂😂 pic.twitter.com/LW8pZ7HJMm
— PuNsTeR™ (@Pun_Starr) March 17, 2022
Water park be like: pic.twitter.com/rD2QZBzCJs
— Rohit.Bishnoi (@The_kafir_boy_2) March 17, 2022
Mummies looking at this sport – pic.twitter.com/HxxYdYy5K6
— Yash (@itsoutrageeyash) March 17, 2022