– దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
దేవరకొండ, ఫిబ్రవరి 09 : దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంలోని 8, 9, 7 వార్డుల్లో పార్టీ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్యహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవరకొండ పట్టణంలోని అన్ని వార్డుల్లో కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధే తప్పా మరొకటి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినా ఒక్క అభివృద్ధి పని చేయలేదని దుయ్యబట్టారు. కావునా దేవరకొండ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కేతావత్ బిల్య్ నాయక్, రమేష్ నాయక్, కిషన్ నాయక్, వెంకట్ రెడ్డి, వల్లపు రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొండల్ చారి, టీవీఎన్ రెడ్డి, శంకర్ నాయక్, ముత్యాల రవి, శ్రీనివాస్ చారి, నాగేష్, చంద్రకళ, ఫీరోజే బుజ్జి నాయక్, బావోజీ, హరిలాల్ నాయక్, పూలు, సుభాష్ గౌడ్, రాజ్, కృష్ణ పాల్గొన్నారు.

‘మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు’