T20WC 2026 : టీ20 ప్రపంచ కప్ – 2026 (T20 World Cup-2026) లో భాగంగా సోమవారం ఇటలీతో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగులు చేసింది. 208 పరుగుల లక్ష్యఛేదనలో ఇటలీ.. 16.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. బెన్ మానెంటి (52), హెన్రీ మానెంటి (37), స్మట్స్ (22) మాత్రమే రాణించారు. స్కాట్లాండ్ బౌలర్లలో మైకేల్ లీస్క్ 4, మార్క్ వాట్ 2, బ్రాడ్ క్యూరీ, బ్రాడ్ వీల్, డేవిడ్సన్ ఒక్కో వికెట్ తీశారు.
అంతకుముందు స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జ్ మున్సే (84) అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. మరో ఓపెనర్ మైకేల్ జోన్స్ (37) పరుగులు రాబట్టాడు. ఈ జోడీ తొలి వికెట్కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. తర్వాత వచ్చిన బ్రాండన్ మెక్మిలన్ (41 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రిచీ బెరింగ్టన్ (15) పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మైకేల్ లీస్క్ (22) వరుసగా 4, 2, 4, 6, 6 బాదడంతో స్కోరు 200 దాటింది. ఇటలీ బౌలర్లలో అలీ హసన్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా, స్మట్స్ తలో వికెట్ తీశారు.