బీజింగ్: హాంగ్‌కాంగ్ మీడియా టైకూన్ జిమ్మీ లాయ్(Jimmy Lai)కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. హాంగ్‌కాంగ్ స్థానిక కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. జాతీయ భద్రతా నేరానికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. చైనా తన వివాదాస్పద జాతీయ భద్రత చట్టం కింద ఈ శిక్షను విధించింది. హాంగ్ కాంగ్ స్థిరత్వంగా కోసం ఈ శిక్ష తప్పదు అని చైనా చెబుతోంది.
జిమ్మీ లాయ్ .. వాస్తవానికి బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉన్నారు. అయితే ఆయన చైనాకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. యాపిల్ డెయిలీ పత్రికతో ఆయన చైనాకు వ్యతిరేకంగా ఎన్నో కథనాలు రాశారు. ఆ పత్రికలో పనిచేసిన మరో ఆరు మంది మాజీ ప్రతినిధులకు కూడా జైలుశిక్ష విధించారు. ఒక్కొక్కరికి ఆరు నుంచి 10 ఏళ్ల మధ్య శిక్ష పడింది. ప్రో డెమోక్రసీ ఉద్యమ నేతగా లాయ్‌ను గుర్తిస్తారు. కానీ చైనా మాత్రం ఆయన్ను దేశద్రోహిగా భావిస్తున్నది.
78 ఏళ్ల జిమ్మీ లాయ్‌పై అనేక కేసులు ఉన్నాయి. స్వేచ్ఛగా ఉన్న సిటీపై.. చైనా వత్తిడి తెచ్చినట్లు తన పత్రికలో కథనాలు రాశారు. విదేశీ శక్తులతో కలిసి దేశద్రోహానికి, కుట్రకు పాల్పడినట్లు జిమ్మీపై ఆరోపణలు ఉన్నాయి. తనపై నమోదు అభియోగాలు వాస్తవం కాదని ఆయన వాదించారు. గత డిసెంబర్లో ఆయన్ను దోషిగా తేల్చారు.