న్యూఢిల్లీ: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో హిందువులపై విద్వేషపూరిత దాడులు పెరుగుతున్నాయి. అత్యధికంగా యూదులపై ఈ దాడులు జరుగుతుండగా, ఆ తర్వాతి స్థానాల్లో హిందువులు, ముస్లింలు ఉన్నారు. కాలిఫోర్నియా పౌర హక్కుల శాఖ ఈ వివరాలను వెల్లడించింది.
విద్వేష దాడుల్లో 36.9% యూదులపై జరుగగా, హిందువులపై 23.3%, ముస్లింలపై 14.6% దాడులు జరిగాయి.