గుర్గ్రామ్: అల్లర్ల నేపథ్యంలో హర్యానాలోని నుహ్ జిల్లాలో అక్రమ నిర్మాణాల పేరుతో అధికారులు బుల్డోజర్లతో చేపట్టిన కూల్చివేత డ్రైవ్ మూడో రోజు శనివారం కూడా కొనసాగింది. నల్హార్ మెడికల్ కాలేజీ చుట్టుపక్కల పలు దుకాణాలను కూల్చివేశారు.
వీటిల్లో దవాఖాన ప్రధాన ప్రవేశ ద్వారం ఎదురుగా ఉండే దాదాపు రెండు డజన్ల మెడికల్ దుకాణాలు, ఇతర షాపులు ఉన్నాయి. మరో 15 తాత్కాలిక నిర్మాణాలను కూడా కూల్చివేసినట్టు పొలీసులు వెల్లడించారు.