బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 20, 2020 , 13:10:51

కోవాగ్జిన్‌ టీకా తీసుకున్న హ‌ర్యానా మంత్రి

కోవాగ్జిన్‌ టీకా తీసుకున్న హ‌ర్యానా మంత్రి

హైద‌రాబాద్‌:  హ‌ర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్‌.. కోవాగ్జిన్‌ టీకా ట్ర‌య‌ల్ డోసు తీసుకున్నారు. అంబాలాలోని ఓ హాస్పిట‌ల్‌లో ఆయ‌న ఇవాళ కోవిడ్ టీకాను వేయించుకున్నారు.  హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ సంస్థ కోవాగ్జిన్‌ టీకాను రూపొందిస్తున్న‌ది. అయితే ఇవాళ కోవాగ్జిన్‌ మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ దేశంలో ప్రారంభం అయ్యాయి. ఈ నేప‌థ్యంలో హ‌ర్యానా మంత్రి అనిల్ విజ్‌.. వాలంటీర్ రూపంలో కోవాగ్జిన్‌ టీకా వేయించుకున్నారు.