చండీఘడ్: హర్యానా సీఎం(Haryana CM) నయాబ్ సైనీ ఇంటితో పాటు ఆ రాష్ట్ర సెక్రటేరియేట్‌కు ఇవాళ బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. సూసైడ్ దాడి జరగవచ్చు అని ఆ ఈమెయిల్లో బెదిరించారు. ఆఫీసులో బాంబు ఉన్నట్లు మధ్యాహ్నం 3.15 నిమిషాలకు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. హర్యానా సీఐడీ బాంబు బెదిరింపు గురించి అప్రమత్తం చేసింది. సీఐఎస్ఎఫ్, రాష్ట్ర పోలీసులు.. తక్షణ చర్యలు తీసుకుని, అక్కడ ఉన్న సిబ్బందిని తరలించారని చండీఘడ్ ఎస్పీ ఉదయ్‌పాల్ సింగ్ తెలిపారు. అలర్ట్ రాగానే బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఫైర్ బ్రిగేడ్, అంబులెన్స్, క్విక్ రియాన్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ సెక్రటేరియేట్‌కు చేరుకున్నాయి. సీఎం నివాసంతో పాటు సెక్రటేరియేట్ వద్ద భద్రతను పెంచారు. బిల్డింగ్‌లతో పాటు సమీప ప్రాంతాల్లో జాగిలాల బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. హర్యానా సీఎం నివాసాన్ని సంత్ కబీర్ కుటీర్ అని పిలుస్తారు. సంత్ కబీర్ కుటీర్‌తో పాటు సెక్రటేరియట్ చండీఘడ్లోనే ఉన్నాయి.
Read More..