Hardik Pandya | స్టార్ క్రికెటర్, టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచారు. భార్య నటాషాతో విడాకుల అనంతరం హార్దిక్ మళ్లీ డేటింగ్లో ఉన్నారంటూ కొంతకాలంగా తెగ ప్రచారం జరుగుతోంది (Dating Rumours). మోడల్, నటి మహియెకా శర్మ (Mahieka Sharma)తో డేటింగ్లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ వేళ మహియెకాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను స్టార్ క్రికెటర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
కుమారుడు అగస్త్య, మహియెకాతో ఉన్న ఫొటోలను హార్దిక్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. అందులో ఓ వీడియోలో వీరిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. అందులో ప్రియురాలి బుగ్గపై మార్దిక్ ముద్దు పెడుతూ ఎంతో సంతోషంగా కనిపించాడు. ఈ ఫొటోలు దివాళీ వేడుకలవిగా తెలుస్తోంది. మరో ఫొటోలో జిమ్‌లో మహియెకాను ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తూ ఫొటోకు ఫోజులిచ్చాడు హార్దిక్. ప్రస్తుతం ఈ చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నటాషాతో విడాకులు ప్రకటించిన అనంతరం పాండ్య బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో కొన్నిరోజులు డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇది కూడా కొన్నిరోజులకే బ్రేకప్ అవ్వగా.. తాజాగా మహియెకా శర్మతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వైరలవుతున్నాయి. మొదటగా ఈ పుకార్లు రెడిట్ అనే సోషల్ మీడియా ద్వారా ప్రారంభం అయ్యాయి. ఇందులో ఒక పోస్ట్‌లో మహియెకా షేర్ చేసిన ఒక సెల్ఫీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వ్యక్తి బ్లర్‌గా కనిపించాడు. అయితే అతడు హార్దిక్ పాండ్యానే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేగాకుండా మహియెకా పోస్ట్‌లలో ఎక్కడో హార్దిక్ జెర్సీ నంబర్ 33 కనిపించడాన్ని కూడా ఒక యూజర్ గుర్తించారు.
మరోవైపు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ.. హార్దిక్, మహియెకా ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారని అభిమానులు గమనించారు. కొన్ని ఫోటోలలో ఇద్దరూ ఒకే రకమైన బాత్రోబ్ ధరించినట్లు కూడా గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో బయటపెట్టారు. ఆసియా కప్ కోసం హార్దిక్ దుబాయ్‌లో ఉన్న సమయంలో మహియెకా కూడా అక్కడికి వెళ్లినట్లు వార్తలు రావడంతో ఈ పుకార్లు మరింత పెరిగాయి. ఇటీవలే సముద్రంలో ఇద్దరూ జలకాలాడుతూ సరదాగా టైమ్ స్పెండ్ చేస్తున్న ఫొటోలను కూడా హార్దిక్ పంచుకున్నారు. దీంతో వీరి డేటింగ్ వార్తలు నిజమేనంటూ నెటిజన్లు చెప్పుకుంటున్నారు.
Also Read..
Elon Musk | ట్రంప్‌తో విభేదాల తర్వాత.. తొలిసారి వైట్‌హౌస్‌కు వెళ్లిన మస్క్
Pregnant Woman: సిడ్నీలో కారు ప్రమాదం.. 8 నెలల గర్భిణి మృతి
Vehicle Fitness | వాహన ఫిట్నెస్ టెస్టు ఫీజు 10 రెట్లు పెంపు