న్యూఢిల్లీ: భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు దూరం అయ్యాడు. కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో వచ్చే నెల 14 నుంచి ఇంగ్లండ్తో జరగబోయే వన్డే సిరీస్ లో బరిలోకి దిగడం లేదు. మరోవైపు కుడి కాలు కండర గాయం నుంచి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వేగంగా కోలుకుంటున్నాడు.
సోమవారం బెంగళూరులోని బీసీసీఐ సీఓఈలో అతనికి ఫిట్నెస్ టెస్టు నిర్వహిస్తారు. ఇందులో క్లియరెన్స్ లభిస్తే ఇంగ్లండ్తో వనేల్లో బరిలోకి దిగుతాడు. విరాట్ ఫిట్నెస్పై నివేదిక వచ్చిన తర్వాతే సెలెక్టర్లు ఈ సిరీస్కు జట్టును ఎంపికచేయనున్నారు.