Harbhajan Singh | రాజ్యసభ సీటును ఆప్ పార్టీ అమ్ముకుంది : హర్భజన్ సింగ్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పై మాజీ క్రికెటర్, రాజ్య సభ్యుడు హర్భజన్ సింగ్ ఫైర్ అయ్యారు.
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పై మాజీ క్రికెటర్, రాజ్య సభ్యుడు హర్భజన్ సింగ్ ఫైర్ అయ్యారు. ఆప్ పార్టీ రాజ్యసభ టికెట్లను అమ్ముకుంటోందని బహిరంగంగా విమర్శించారు. ఆప్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన హర్భజన్ సింగ్ ఇటీవలే బీజేపీ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన స్పందించారు. తన మాజీ పార్టీతో బహిరంగంగా కొనసాగుతున్న వైరాన్ని మరింత తీవ్రతరం చేస్తూ రాజ్యసభలో సీట్లను అమ్ముకుంటోందని, లంచాలు తీసుకుంటోందని ఆరోపించారు.
ఆప్ నాయకుడు దేవేందర్ యాదవ్ ఎక్స్ వేదికగా దేశద్రోహి అని ఆరోపించారు. దీనిపై స్పందించిన హర్భజన్ నన్ను దేశద్రోహి అని పిలుస్తున్న వారికి ముందు పంజాబ్ రాజ్యసభ సీటును ఎంతకు అమ్ముకున్నారో మీ సొంత ప్రజలనే అడగండి. ఎవరికి ఎంత లంచం అందిందో, ఎవరి నుండి అందిందో నేను చెబుతాను. ఇంకా పంజాబ్‌ను దోచుకోవడానికి, లాలాకు సరుకులు చేరవేయడానికి ఒకరిని మంత్రిగానో లేదా వాచ్మన్గానో ఎలా నియమించారో కూడా చెబుతారని ప్రతిస్పందించాడు. రాజ్యసభ సీట్లు అమ్ముకోవడం ద్వారా ఎవరికి ఎంత ముట్టిందో బయటపెట్టాలా అని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- BJP
- harbhajan singh
- Punjab
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

