ఉదయ్‌పూర్: కాలేజీ సిబ్బంది మానసిక వేధింపులు భరించలేక బీజేపీ పాలిత రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పసిఫిక్ డెంటల్ కాలేజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని గురువారం రాత్రి 11 గంటలకు తన హాస్టల్ రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె రూమ్‌లో నుంచి ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాలేజీ సిబ్బంది నిత్యం పెట్టే మానసిక హింసను భరించలేక తాను ఆత్మహత్య చేసుకున్నట్టు అందులో ఆమె ఆరోపించింది. అన్యాయమైన పద్ధతులను అవలంబిస్తూ తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. విద్యార్థిని ఆత్మహత్యతో ఆగ్రహించిన విద్యార్థులు కాలేజీ గేట్ ఎదుట ధర్నా చేస్తూ ఆందోళనకు దిగారు. విద్యార్థిని ఆత్మహత్య నోట్లో పేర్కొన్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.