ముంబై: కదులుతున్న కారు డిక్కీ నుంచి మనిషి చేయి వేలాడింది. (Hand In Car Boot) ఆ కారు వెనుక ఉన్న వాహనదారులు, ఇతర వ్యక్తులు ఇది చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులను అలెర్ట్ చేశారు. అయితే ప్రమోషనల్ రీల్ కోసం కొందరు యువకులు ఇలా చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. సోమవారం సాయంత్రం 6:45 గంటల సమయంలో వాషి ప్రాంతంలోని రోడ్డుపై ఒక కారు వేగంగా వెళ్లింది. ఆ కారు డిక్కీ నుంచి మనిషి చేయి బయటకు వేలాడింది. ఇది కలకలం రేపింది.
కాగా, ఆ కారు వెనుక వెళ్లే వాహనదారులు, ఇతరులు ఇది చూసి షాకయ్యారు. ఎవరినైనా కిడ్నాప్ చేశారా? లేక హత్య చేసి శవాన్ని డిక్కీలో ఉంచారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో కొందరు వాహనదారులు దీనిని రికార్డ్ చేశారు. వీడియో క్లిప్‌ను పోలీసులకు పంపి అప్రమత్తం చేశారు.
మరోవైపు నంబర్ ప్లేట్ ఆధారంగా ఆ కారును పోలీసులు గుర్తించారు. ఘట్కోపర్ సమీపంలో ఆ వాహనాన్ని ట్రాక్ చేశారు. ఆ కారును ఆపి తనిఖీ చేశారు. అయితే ల్యాప్‌టాప్ షాప్ కోసం ముగ్గురు యువకులు అందరి దృష్టిని ఆకట్టుకునే విధంగా ప్రమోషనల్ రీల్ తీసినట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అందరిని భయాందోళనకు గురి చేసిన ఆ యువకులను పోలీసులు మందలించారు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Prank Gone Wrong: Panic In Navi Mumbai As Hand Seen Hanging From Car Boot@Raina_Assainar #Mumbai #NaviMumbai #MumbaiNews pic.twitter.com/6pgK8lSVmg
— Free Press Journal (@fpjindia) April 14, 2025