Arvind Kejriwal | న్యూఢిల్లీ, మార్చి 9: ‘శ్రీరాముడు కనుక ఇప్పుడు ఉండి ఉంటే.. అతడిని తమ పార్టీలో చేరమని బీజేపీ ఒత్తిడి చేసేది..కుదరదని రాముడు చెబితే.. అతనిపై సీబీఐ, ఈడీలను బీజేపీ ఉసిగొల్పేది’ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయి లో విరుచుకుపడ్డారు. ఇటీవల ఆప్ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సీఎం కేజ్రీవాల్ శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ బీజేపీ వైఖరిని ఎండగట్టారు. తమ ప్రభుత్వం వికాస్ లేదా అభివృద్ధి నమూనాను అనుసరిస్తుంటే.. బీజేపీ మాత్రం ప్రతిపక్ష పార్టీలు, వాటి ప్రభుత్వాలను పడగొట్టడం లాంటి వినాశ లేదా విధ్వంస నమూనాను అనుసరిస్తున్నదని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఇసుక అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కే సులో ఈడీ అధికారులు శనివారం బీహార్ రాజధాని పాట్నాలోని ఏడు ప్రాంతాల్లో సో దాలు నిర్వహించారు. సోదాలు జరిగిన ప్రాంతాలు ఆర్జేడీ నేత సుభాష్ యాదవ్‌కు చెందినవిగా ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. ఇసుక అక్రమ తవ్వకంలో సుభాష్ యాదవ్ పాత్ర ఉన్నదని ఈడీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు తమిళనాడులో కూడా అక్రమ ఇసుక మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులోనూ ఈడీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది.