గువాహటి : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా ముందస్తు బెయిల్ పిటిషన్‌ను గువాహటి హైకోర్ట్ ఏక సభ్య బెంచ్ శుక్రవారం తిరస్కరించింది. అస్సాం సీఎం హిమంత భార్య రింకీ భుయాన్ మూడు దేశాల పాస్‌పోర్టులు కలిగి ఉన్నారని, అమెరికాలో రూ.50 వేల కోట్లను ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టారని ఖేరా ఇటీవల వ్యాఖ్యానించారు.
దీనిపై రింకీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఖేరా అరెస్టుకు సిద్ధం కావడంతో ఆయన ఇటీవల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టు మంజూరు చేసిన ట్రాన్సిట్ ముందస్తు బెయిల్‌ను సుప్రీం కోర్టు నిలిపేయడంతో ఖేరా గువాహటి ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.