Organ Donation | ముగ్గురు పిల్లలకు కొత్త జీవితం ఇచ్చిన.. ఐదు రోజుల శిశువు
Organ Donation | బ్రెయిన్ డెడ్ అయిన ఐదు రోజుల శిశువు తన అవయవాలతో ముగ్గురు పిల్లలకు కొత్త జీవితం ఇచ్చింది. (Organ Donation) శిశువు కాలేయాన్ని తొమ్మిది నెలల చిన్నారికి, రెండు కిడ్నీలను ఇద్దరు పిల్లలకు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు.
అహ్మదాబాద్: బ్రెయిన్ డెడ్ అయిన ఐదు రోజుల శిశువు తన అవయవాలతో ముగ్గురు పిల్లలకు కొత్త జీవితం ఇచ్చింది. (Organ Donation) శిశువు కాలేయాన్ని తొమ్మిది నెలల చిన్నారికి, రెండు కిడ్నీలను ఇద్దరు పిల్లలకు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 13న ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి బాబుకు చేతన జన్మనిచ్చింది. అయితే ఆ దంపతుల సంతోషం కొన్ని గంటలే నిలిచింది. పసిబాబులో ఎలాంటి కదలిక లేదని డాక్టర్లు తెలిపారు. దీంతో మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆ శిశువును వెంటిలేటర్‌పై ఉంచారు. బాబు బతికే అవకాశం లేదని వైద్యులు చెప్పారు. ఐదు రోజుల శిశువు బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు.
కాగా, ఎన్జీవో సంస్థ జీవన్‌దీప్ అవయవ దానం ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ విపుల్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌తో కలిసి ఆ శిశువు తల్లిదండ్రులైన చేతన, హర్షాను ఆయన కలిశారు. బ్రెయిన్ డెడ్ అయిన పసి బాబు అవయవాలు దానం చేయాలని కోరారు. చివరకు వారిని ఒప్పించారు. ఈ నేపథ్యంలో పీపీ సవానీ ఆసుపత్రి వైద్యులు బుధవారం శిశువు శరీరం నుంచి రెండు మూత్రపిండాలు, రెండు కార్నియాలు, కాలేయం, ప్లీహాన్ని సేకరించారు. సంబంధిత అవయవాల బ్యాంకులకు వాటిని తరలించారు.
మరోవైపు ఢిల్లీకి తరలించిన శిశువు కాలేయాన్ని తొమ్మిది నెలల చిన్నారికి విజయవంతంగా అమర్చారు. అలాగే శిశువు రెండు మూత్రపిండాలు 13, 15 ఏళ్ల పిల్లలకు ట్రాన్స్‌ప్లాంట్ చేయడంతో వారికి కొత్త జీవితం ఇచ్చాయని డాక్టర్లు గురువారం తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

