Ice Cream | స్థానిక దుకాణంలో ఐస్‌క్రీమ్ (Ice Cream) కొన్న ఓ మహిళకు (Gujarat Woman) షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆ ఐస్‌క్రీమ్‌లో బల్లి భాగాలు (Lizard Tail) దర్శనమిచ్చాయి. ఆ ఐస్‌క్రీమ్ తిన్న సదరు మహిళ చివరికి ఆసుపత్రి పాలైంది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
అహ్మదాబాద్ (Ahmedabad)లోని మణినగర్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ మహిళ.. స్థానిక మహాలక్ష్మి కార్నర్ దుకాణం నుంచి ‘హవ్మోర్’ బ్రాండ్‌కు చెందిన నాలుగు కోన్ ఐస్‌క్రీమ్‌లు కొనుగోలు చేసింది. వాటిని తన పిల్లలతో ఎంతో ఆత్రుతగా తినసాగింది. కొంత తిన్న తర్వాత ఆమెకు తన ఐస్‌క్రీమ్‌లో బల్లి తోక కనిపించింది. ఆ తర్వాత ఆమె తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో ఇబ్బందిపడింది. కుటుంబ సభ్యులు సదరు మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సదరు మహిళ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు సదరు దుకాణంపై చర్యలు తీసుకున్నారు. మహాలక్ష్మి కార్నర్‌ను ఫుడ్ సేఫ్టీ చట్టం కింద సీజ్ చేశారు. అంతేకాదు ఐస్‌క్రీమ్ బ్రాండ్ హవ్మోర్పై రూ.50 వేల జరిమానా విధించారు.
Also Read..
BSF jawan | కళ్లకు గంతలు కట్టి, మాటలతో దూషించి.. భారత జవాన్‌ను చిత్రహింసలకు గురిచేసిన పాక్