హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): కస్టోడియల్ డెత్స్‌లో ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 2021లో పోలీస్ కస్టడీలో ఉన్న 88 మంది మరణించగా, అందులో 23 కస్టోడియల్ డెత్స్ గుజరాత్‌లోనే నమోదయ్యాయి. ఆ తరువాత మహారాష్ట్రలో 21 మరణాలు రికార్డయ్యాయి. తెలంగాణలో ఒకే ఒక్క కస్టోడియల్ డెత్ నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో తాజా నివేదికలో వెల్లడించింది.
దేశంలో జరిగే ప్రతి నాలుగు కస్టోడియల్ మరణాల్లో ఒకటి గుజరాత్లో నమోదవ్వడం అక్కడ నెలకొన్న దారణ పరిస్థితులకు నిదర్శనం. 2020లో కూడా గుజరాత్లో అత్యధికంగా 21 కస్టోడియల్ మరణాలు సంభవించాయి. 2015తో పోలిస్తే గుజరాత్లో 2020 నాటికి కస్టోడియల్ మరణాలు 53 శాతం పెరగడం గమనార్హం. కస్టోడియల్ డెత్స్‌కు సంబంధించి 2021లో గుజరాత్లో 203 మంది పోలీసులపై కేసులు నమోదు చేయగా, మహారాష్ట్రలో 244 మందిపై నమోదయ్యాయి.