Arjun Modhwadia : లోక్‌సభ ఎన్నికలకు ముందు గుజరాత్లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, పోర్బందర్ ఎమ్మెల్యే అర్జున్ మోద్వాదియా ఆ పార్టీకి రాజీనామా చేశారు. మోద్వాదియా రాజీనామాతో కాంగ్రెస్‌తో నాలుగు దశాబ్ధాల అనుబంధానికి తెరపడింది.
ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తూ గుజరాత్ అసెంబ్లీ స్పీకర్‌కు రాజీనామా పత్రం అందచేశారు. ఇక పార్టీ నుంచి వైదొలగుతున్నానని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు ఆయన లేఖ రాశారు.
అయోధ్యలో రామాలయ ప్రారంభ వేడుకకు ఆహ్వానాన్ని తిరస్కరించడం తన రాజీనామాకు కారణమని మోద్వాదియా స్పష్టం చేశారు. మోద్వాదియా గతంలో గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, విపక్ష నేతగా వ్యవహరించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మోద్వాదియా పోర్బందర్ నుంచి ఎన్నికయ్యారు.
Read More :
KCR | ఖమ్మం, మహబూబాబాద్ నేతలతో కేసీఆర్ భేటీ