ధర్పూర్, నవంబర్ 18: గుజరాత్ ధర్పూర్లోని జీఎంఈఆర్ఎస్ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వల్ల ఓ విద్యార్థి (18) మృతి చెందాడు. వసతి గృహం లో సీనియర్లు మూడు గంటలపాటు నిలబెట్టడంతో మొదటి సంవత్సరం విద్యార్థి అనిల్ మెథానియా అచేతన స్థితిలోకి వెళ్లి మరణించాడని ఎఫ్ఐఆర్ నమోదైంది.
‘వాళ్లు మమ్మల్ని మూడు గంటలపాటు నిలబడి పరిచ యం చేసుకోవాలని, ఆందోళన చేయకూడదని ఒత్తిడిచేశారు. చివరికి మాతోపాటు నిలబడిన ఓ విద్యార్థి పడిపోయాడు. మేం అతడిని వెంటనే దవాఖానకు తీసుకెళ్లాం. అక్కడ అత డు చనిపోయాడని ప్రకటించారు’ అని ఓ విద్యార్థి వెల్లడించారు. 15 మంది నిందితులపై కేసు నమోదైంది.