అహ్మదాబాద్ : గుజరాత్ లో కరోనా కేసులు భారీగా తగ్గడంతో కొవిడ్-19 నియంత్రణలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం భారీగా సడలించింది. జూన్ 7 నుంచి 100 శాతం హాజరుతో అన్ని కార్యాలయాలను తెరిచేందుకు అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 36 నగరాల్లో అన్ని షాపులను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ తెరిచేందుకు అనుమతించింది.
ఇక రెస్టారెంట్ల హోం డెలివరీ సేవలను రాత్రి పది గంటల వరకూ చేపట్టవచ్చని అధికారులు పేర్కొన్నారు. లాక్ డౌన్ నియంత్రణలు జూన్ 11 వరకూ కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాత్రి కర్ఫ్యూ జూన్ 11 వరకూ పొడిగించినట్టు గుజరాత్ సీఎంఓ ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు గుజరాత్ లో 1207 తాజా పాజిటివ్ కేసులు నమోదవగా మహమ్మారి బారినపడి ఒక్కరోజులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.