Gujarat AAP MLA Bhupendra Bhayani | గుజరాత్ ఆప్ ఎమ్మెల్యే భూపేంద్ర రాజీనామా.. బీజేపీలో చేరుతానని వెల్లడి
Gujarat AAP MLA Bhupendra Bhayani | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి గుజరాత్లో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే భూపేంద్ర భయానీ శాసనసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో బీజేపీలో చేరుతానని ఆయన తెలిపారు.
అహ్మదాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి గుజరాత్లో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే భూపేంద్ర భయానీ శాసనసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. (Gujarat AAP MLA Bhupendra Bhayani ) జునాగఢ్ జిల్లాలోని విశావదర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపేంద్ర భయానీ బుధవారం ఉదయం గాంధీనగర్‌లోని గుజరాత్ అసెంబ్లీకి వెళ్లారు. స్పీకర్ శంకర్ చౌదరికి రాజీనామా పత్రాన్ని అందజేశారు. అయితే రాజీనామాకు ఎలాంటి కారణాలను అందులో పేర్కోలేదు.
కాగా, రాజీనామా తర్వాత భూపేంద్ర భయానీ మీడియాతో మాట్లాడారు. ఎవరి ఒత్తిడి వల్ల ఎమ్మెల్యే పదవికి, ఆప్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని చెప్పారు. ‘నేను అభివృద్ధిని నమ్మి ప్రజలకు సేవ చేసే జాతీయవాదిని. నా ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సరైన వేదిక కాదు. ఏ జాతీయవాది కూడా ఆప్‌లో ఎక్కువ కాలం ఉండలేడు’ అని అన్నారు. భారత్‌ను ప్రపంచ వ్యాప్తంగా గర్వించేలా చేసిన ప్రధాని నరేంద్ర మోడీని వ్యతిరేకించడం తనకు ఇష్టం లేదన్నారు. త్వరలో బీజేపీలో చేరుతానని ఆయన తెలిపారు. పార్టీ ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడించారు.
#WATCH | Gujarat: Aam Aadmi Party leader Bhupat Bhayani resigned from the party, says, "I want to serve the public. Under PM Modi's leadership India has seen tremendous growth. I am influenced by our PM's work. I am a nationalist person. I am a person who believes in development.… pic.twitter.com/B6zN8Yh30I
— ANI (@ANI) December 13, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

