న్యూఢిల్లీ: అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ రాకెట్ తయారీ సంస్థ స్పేస్-ఎక్స్‌కు చెందిన ‘ఫాల్కన్-9’ రాకెట్‌తో ఇస్రో ఓ కమ్యునికేషన్ శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపించనున్నది. స్పేస్-ఎక్స్ రాకెట్‌ను ఉపయోగించి ఇస్రో చేపడుతున్న తొలి అంతరిక్ష వాణిజ్య ప్రయోగమిది. భారత్‌లో విమానాల్లో ఇంటర్నెట్ సేవల కోసం జీశాట్-ఎన్2 అనే శాటిలైట్‌ను పంపుతున్నట్టు శనివారం మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి.
ప్రస్తుతం భారత గగనతలంలో ప్రయాణించే విమానాల్లో ఇంటర్నెట్ సేవలు నిషిద్ధం. అయితే నవంబర్ 4న నిబంధనల్లో భారత్ మార్పులు చేసింది. విమానాల్లో ఇంటర్నెట్ సేవల కోసం 4,700 కిలోగ్రాముల బరువున్న జీశాట్-ఎన్2ను అంతరిక్షంలోకి పంపేందుకు స్పేస్-ఎక్స్ రాకెట్‌ను ఎంచుకుంది!