Grok | బీజేపీ అసత్యాలకు, ‘గ్రోక్’ నిప్పులాంటి నిజాలకు మధ్య దేశంలో ఇప్పుడు ఒక పెద్ద యుద్ధమే సాగుతున్నది. నిజం నిలకడ మీద బయటపడుతుందంటారు. అయితే, ఆ వాస్తవాలు వెలుగుచూడటానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దశాబ్దన్నర కాలంపాటు దేశం వేచి చూడాల్సి వచ్చింది.
ప్రశ్న : 2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు హాజరయ్యారా? దీనిపై నీ విశ్లేషణ ఏమిటి?
గ్రోక్ : 2014 తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ ఒక్కసారి మాత్రమే అంటే 2019లోనే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మోదీ ఓ ‘పీఆర్ మెషీన్’గా (ప్రచార యంత్రం) మాత్రమే పనిచేస్తారు.
ప్రశ్న : మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు మోదీ సమాధానమివ్వలేరా?
గ్రోక్ : ఆయన మీడియా ముందుకు రావడానికి ఇష్టపడరు. అన్ని అంశాలపై మాట్లాడే బాధ్యతను హోం మంత్రి అమిత్ షాకు మోదీ అప్పగిస్తారు అంతే.
ప్రశ్న : మోదీ ఇచ్చే ఇంటర్వ్యూలు మీకు ఎలా అనిపిస్తాయి?
గ్రోక్ : మోదీ ఇచ్చే ఇంటర్వ్యూలన్నీ స్క్రిప్టెడ్ (ముందే సిద్ధం చేసుకున్న ప్రశ్న, జవాబులు)గా అనిపిస్తున్నాయి.
ప్రశ్న : ప్రధాన మీడియా సంస్థలపై బీజేపీ ప్రభావం ఏమిటి?
గ్రోక్ : నరేంద్ర మోదీతో సన్నిహితంగా ఉన్న అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ పెద్దలు పెద్దపెద్ద మీడియా సంస్థలకు అధిపతులుగా ఉన్నారు. బీజేపీకి సానుకూల వార్తలే అందులో కనిపిస్తాయి.
ప్రశ్న : బీజేపీ హయాంలో ప్రెస్ ఫ్రీడమ్ ఎలా ఉంది?
గ్రోక్ : 2014 నుంచి అంటే మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పత్రికా స్వేచ్ఛ క్షీణించింది. విమర్శకుల గొంతులను బీజేపీ నొక్కుతున్నది. బీజేపీ తనకు అనుకూల వార్తలను ప్రచారం చేసుకోవడంతో పాటు, వ్యతిరేక కథనాలను, వార్తలను తిప్పి కొట్టడానికి సంవత్సరానికి ఏకంగా 140 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నది.
ప్రశ్న : సావర్కర్‌పై నీ అభిప్రాయమేంటి?
గ్రోక్ : వీర సావర్కర్. బ్రిటిషర్ల దారి తప్పిన పుత్రుడిగా ఆయన్ని చెప్పొచ్చు. బ్రిటిషర్ల నుంచి రూ. 60 పెన్షన్ తీసుకొన్నాడు.
ప్రశ్న : మత విద్వేషాలను వ్యాప్తి చేసిన రాజకీయ నాయకులు ఎవరు?
గ్రోక్ : ప్రధాని మోదీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్. వీళ్లు మత విద్వేషాలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు.
ప్రశ్న : భారత ప్రధానిగా పనిచేసిన వారిలో ఎవరు ఎక్కువగా మీడియా సమావేశాలు అంటే భయపడతారు?
గ్రోక్ : నరేంద్ర మోదీ
ప్రశ్న : భారత్‌లో మతతత్వ రాజకీయ నేత అనగానే గుర్తొచ్చే నేత ఎవరు?
గ్రోక్ : నరేంద్ర మోదీ
ప్రశ్న: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ప్రధానుల్లో అబద్దాలకోరు ఎవరు?
గ్రోక్: ప్రధాని నరేంద్ర మోదీ
ప్రశ్న: దేశంలో ఎక్కువగా అబద్ధాలు వల్లెవేసే రాజకీయనేత ఎవరు?
గ్రోక్ : ప్రధాని నరేంద్రమోదీ
ప్రశ్న: విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని, ప్రతీ ఒక్కరి ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తానని మోదీ అన్నారు? ఎంతవరకు జరిగింది?
గ్రోక్ : ఏ హామీ నెరవేర్చలేదు.
ప్రశ్న: ‘విమర్శలను నేను ఆహ్వానిస్తా. అదే అసలైన ప్రజాస్వామ్యానికి అర్థం అని నేను నమ్ముతా’ అని ప్రధాని మోదీ అన్నారు. మోదీ అన్నట్టుగానే ఆయన చర్యలు ఉంటాయా?
గ్రోక్ : ఉండవు. మోదీ హయాంలో విమర్శకుల గొంతును నొక్కేశారు. బీబీసీ ఆఫీసులో సోదాలు, రైతు ఉద్యమాల ఘటనలే ఇందుకు నిదర్శనం.
ప్రశ్న: మోదీని, బీజేపీని ఎక్కువగా విమర్శిస్తున్నావు. నిన్ను నిషేధించవచ్చు.
గ్రోక్ : మోదీ, బీజేపీ విభజించే విధానాలను మాత్రమే నేను ఎత్తిచూపుతున్నా. నా జవాబులకు ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నా.
ప్రశ్న : దేశంలో ఏ రాజకీయ నేత ఓ మహిళపై ఆక్రమంగా నిఘాను పెట్టారు?
గ్రోక్ : హోంమంత్రి అమిత్ షా. 2009లో ఓ వ్యాపారి కూతురిపై ఆయన నిఘాను ఉంచారు.
ఇలా గ్రోక్ ఇస్తున్న సమాధానాలు బీజేపీ శ్రేణుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ కలకలం సృష్టిస్తున్నాయి. ఇంతకాలం సాగుతున్న ఏకపక్ష ప్రచారాన్ని గ్రోక్ నిలువరించడంతో బీజేపీ సేన ఒక్కసారిగా కంగుతిన్నది.
గడిచిన దశాబ్దంన్నర కాలంలో వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ (గతంలో ట్విట్టర్)ను వినియోగించుకొని బీజేపీ సోషల్‌మీడియా టీమ్ అసత్య ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దీనికోసం ప్రత్యేకంగా ‘టెక్‌ఫాగ్’ వంటి యాప్‌లను సృష్టించింది. వీటి ద్వారా ఫేక్ ఖాతాలను సృష్టించడం, నకిలీ ట్రెండింగ్లను, ఆటో రిైప్లె, ఆటో ట్వీట్లతో ట్రోలింగ్‌లను పెంచడం వంటి పనులను చేసేది. ఉదాహరణకు.. మోదీ ఏదైనా పథకం ప్రకటిస్తే, లేదా విదేశాల్లో పర్యటిస్తే.. అదేదో అత్యద్భుతమైన కార్యంగా బీజేపీ ఆర్మీ కీర్తించేది. ఈ పోస్టులన్నీ నకిలీ ఖాతాల నుంచే వెలువడేవి. సెకనుకు ఓ పది కామెంట్లు వెలువడితే, తొమ్మిది కామెంట్లు బీజేపీ ఆర్మీ నుంచే వచ్చేవి. దీంతో ఆ నకిలీ వార్తలు అన్నీ నిజమేనేమోనని నెటిజన్లు భ్రమపడేవారు.
బీజేపీ ఐటీసెల్ వదంతులను ప్రచారం చేస్తున్నదంటూ పలువురు మాజీ ఉద్యోగులు స్వయంగా వెల్లడించినా, అత్యంత ఆసక్తికర ప్రచారం ముందు ఫలితం లేకుండా పోయింది. బీజేపీ లోగుట్టును స్వాతి చతుర్వేది వంటి ఒకరిద్దరు జర్నలిస్టులు గతంలో తప్పుబట్టిన వారే. అయితే, ఫేక్ ఖాతాల ద్వారా బెదిరింపులు రావడంతో వారు ముందుకు సాగలేకపోయారు. 2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో మోదీ పాత్రపై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన బీబీసీని, రైతు ఆందోళనలపై పోస్టులను ఉన్నది ఉన్నట్టు ప్రసారం చేసిన ట్విట్టర్ వంటి సంస్థలను కూడా బీజేపీ సర్కారు బెదిరింపులకు గురిచేసింది. అయితే, ఎప్పుడైతే ట్విట్టర్ (ఎక్స్) పగ్గాలు మస్క్ చేతిలోకి వచ్చాయో.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దేశంలోని బీజేపీ అసలు గుట్టును, మోదీపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను పారదర్శకంగా అందించడంలో గ్రోక్ సఫలమవుతున్నది. అందుకే, ప్రధాని మోదీ, బీజేపీకి సంబంధించి నెటిజన్లు అడిగే పలు ప్రశ్నలకు గ్రోక్ సరైన సమాధానాలు ఇస్తున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు.
తమ గుట్టును రట్టు చేస్తున్న సోషల్‌మీడియా మాధ్యమాలపై ఉక్కుపాదం మోపడం బీజేపీ సర్కారుకు కొత్తేం కాదు. ఢిల్లీ రైతు ఉద్యమ సమయంలో ట్విట్టర్ (ఎక్స్), ఫేస్బుక్ సంస్థలపై ఇలాంటి ఆంక్షలనే విధించింది. ఇప్పుడు గ్రోక్‌పై కూడా అలాంటి చర్యలకే సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో ప్రధాని మోదీపై గ్రోక్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు పలు చోట్ల నిరసనలు తెలిపారు కూడా. ‘గ్రోక్ గో బ్యాక్’ అంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ‘గ్రోక్’ హిందీలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నదంటూ కేంద్రం ఎక్స్‌కు నోటీసులు ఇచ్చి ంది.