BJP | గడిచిన దశాబ్దంన్నర కాలంలో వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ (గతంలో ట్విట్టర్)ను వినియోగించుకొని బీజేపీ సోషల్‌మీడియా టీమ్ అసత్య ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దీనికోసం ప్రత్యేకంగా ‘టెక్‌ఫాగ్’ వంటి యాప్‌లను సృష్టించింది. వీటి ద్వారా ఫేక్ ఖాతాలను సృష్టించడం, నకిలీ ట్రెండింగ్లను, ఆటో రిైప్లె, ఆటో ట్వీట్లతో ట్రోలింగ్‌లను పెంచడం వంటి పనులను చేసేది. ఉదాహరణకు.. మోదీ ఏదైనా పథకం ప్రకటిస్తే, లేదా విదేశాల్లో పర్యటిస్తే.. అదేదో అత్యద్భుతమైన కార్యంగా బీజేపీ ఆర్మీ కీర్తించేది. ఈ పోస్టులన్నీ నకిలీ ఖాతాల నుంచే వెలువడేవి. సెకనుకు ఓ పది కామెంట్లు వెలువడితే, తొమ్మిది కామెంట్లు బీజేపీ ఆర్మీ నుంచే వచ్చేవి. దీంతో ఆ నకిలీ వార్తలు అన్నీ నిజమేనేమోనని నెటిజన్లు భ్రమపడేవారు.
బీజేపీ ఐటీసెల్ వదంతులను ప్రచారం చేస్తున్నదంటూ పలువురు మాజీ ఉద్యోగులు స్వయంగా వెల్లడించినా, అత్యంత ఆసక్తికర ప్రచారం ముందు ఫలితం లేకుండా పోయింది. బీజేపీ లోగుట్టును స్వాతి చతుర్వేది వంటి ఒకరిద్దరు జర్నలిస్టులు గతంలో తప్పుబట్టిన వారే. అయితే, ఫేక్ ఖాతాల ద్వారా బెదిరింపులు రావడంతో వారు ముందుకు సాగలేకపోయారు. 2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో మోదీ పాత్రపై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన బీబీసీని, రైతు ఆందోళనలపై పోస్టులను ఉన్నది ఉన్నట్టు ప్రసారం చేసిన ట్విట్టర్ వంటి సంస్థలను కూడా బీజేపీ సర్కారు బెదిరింపులకు గురిచేసింది. అయితే, ఎప్పుడైతే ట్విట్టర్ (ఎక్స్) పగ్గాలు మస్క్ చేతిలోకి వచ్చాయో.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దేశంలోని బీజేపీ అసలు గుట్టును, మోదీపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను పారదర్శకంగా అందించడంలో గ్రోక్ సఫలమవుతున్నది. అందుకే, ప్రధాని మోదీ, బీజేపీకి సంబంధించి నెటిజన్లు అడిగే పలు ప్రశ్నలకు గ్రోక్ సరైన సమాధానాలు ఇస్తున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు.
తమ గుట్టును రట్టు చేస్తున్న సోషల్‌మీడియా మాధ్యమాలపై ఉక్కుపాదం మోపడం బీజేపీ సర్కారుకు కొత్తేం కాదు. ఢిల్లీ రైతు ఉద్యమ సమయంలో ట్విట్టర్ (ఎక్స్), ఫేస్బుక్ సంస్థలపై ఇలాంటి ఆంక్షలనే విధించింది. ఇప్పుడు గ్రోక్‌పై కూడా అలాంటి చర్యలకే సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో ప్రధాని మోదీపై గ్రోక్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు పలు చోట్ల నిరసనలు తెలిపారు కూడా. ‘గ్రోక్ గో బ్యాక్’ అంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ‘గ్రోక్’ హిందీలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నదంటూ కేంద్రం ఎక్స్‌కు నోటీసులు ఇచ్చి ంది.