Green India Challenge | అసోంలో గ్రీన్ ఇండియా చాలెంజ్.. ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటుతున్న స్థానికులు..
Green India Challenge | హరిత భారత్ సాధన లక్ష్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అసోంలో మొదలు పెట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. 2030 నాటికి అసోంలో ఒక కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పని చేస్తోంది.
Green India Challenge | హైదరాబాద్ : హరిత భారత్ సాధన లక్ష్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అసోంలో మొదలు పెట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. 2030 నాటికి అసోంలో ఒక కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పని చేస్తోంది. ఈ బృహత్ కార్యక్రమంలో స్థానిక సంస్థలు, ఎన్జీవోలు, పౌరులను భాగస్వామ్యం చేస్తోంది. తాజాగా నగాన్ జిల్లా పామ్ గోన్ గ్రామంలో స్థానికులు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఒకే చోట 74 మొక్కలను నాటారు. పర్యావరణ రక్షణ కోసం అమ్మ పేరు మీద మొక్కలు నాటి సంరక్షించాలన్న ప్రధాని ఆంకాక్షను అమలు చేస్తామని ఈ సందర్భంగా స్థానికులు అన్నారు.
పద్మశ్రీ, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన జాదవ్ పయంగ్ స్ఫూర్తితో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోటి మొక్కల కార్యక్రమానికి తమ మద్దుతు ఉంటుందని అస్సామీలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు క్రమంగా రుతువుల మార్పులకు కూడా కారణం అవుతున్నాయని సంతోష్ కుమార్ అన్నారు. ఈశాన్య హిమాలయాలతో పాటు అసోం, ఈశాన్య రాష్ట్రాలకు పర్యావరణ ముప్పు పొంచి ఉందన్న శాస్త్రవేత్తల అంచనాను ఆయన గుర్తుచేశారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి, సంరక్షిస్తే పర్యావరణ మార్పులను అడ్డుకోవచ్చన్నారు. ఇందుకోసం స్థానికులు మద్దతును తీసుకుంటున్నామన్నారు.
అసోంలో కోటి మొక్కల కార్యక్రమాన్ని ఈ ఏడాది ఏప్రిల్లో మొదలు పెట్టి ఇప్పటిదాకా రెండున్నర లక్షల మొక్కలు నాటామని కార్యక్రమంలో పాల్గొన్న ఇగ్నైటింగ్ సంస్థ వ్యవస్థాపకులు కరుణాకర్ తెలిపారు. అన్నిటినీ జియో ట్యాగ్ చేసి పర్యవేక్షిస్తున్నామని, 98 శాతం మొక్కలు బాగా ఎదుగుతున్నాయని ఆయన అన్నారు. విపరీత వాతావరణ మార్పుల ప్రభావం వల్ల అసోం ఇప్పటికే అకాల వరదలు, సారవంతమైన భూమిని కోల్పోవటం, ప్రజల అనారోగ్యాల బారిన పడటం లాంటి సమస్యలను ఎదుర్కోంటోందని, వీటి నియంత్రణకు ప్రకృతి పునరుద్దరణ కార్యక్రమాలే మార్గమని కార్యక్రమంలో పాల్గొన్న స్వచంద సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీతురాజ్ పుకాన్, రోసీ దేవి, వాలంటీర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
TG Rains | తెలంగాణలో దంచికొట్టిన వానలు.. సాధారణం కంటే 34 శాతం అధికంగా వర్షపాతం నమోదు
Rajiv Gandhi | రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై ఢిల్లీ ఆగ్రహం! ఆయనను విలన్గా చేయాలనుకుంటున్నారా?
KTR | చేతనైతే 420 హామీలు అమలు చెయ్.. కేసీఆర్, బీఆర్ఎస్ను తిట్టడమే పనా?..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

