న్యూఢిల్లీ : రిటైల్, హోల్సేల్ వ్యాపారులను సూక్ష్మచిన్నమధ్యతరహా వాణిజ్య సంస్థల (ఎంఎస్ఎంఈ) జాబితాలో చేర్చేందుకు ఎంఎస్ఎంఈ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సవరించింది. ఈ నిర్ణయంతో ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రాధాన్యతా రంగాల కింద వీరికి ప్రయోజనం చేకూరనుంది.
రిటైల్, హోల్సేల్ వ్యాపారులను ఎంఎస్ఎంఈల్లో చేర్చడంతో దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మంది ఈ తరహా వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందని ఎంఎస్ఎంఈ, రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసి వాటిని ఆర్ధిక వృద్ధి ఇంజన్లుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడిఉందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయంతో హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు రుణాలు విరివిగా అందుబాటులోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు.