న్యూఢిల్లీ: లోక్‌సభతోపాటు ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని మోదీ సర్కారు ఒక్కొక్కటిగా తాయిలాలు ప్రకటిస్తున్నది. అధికారంలోకి వచ్చింది మొదలు వంటగ్యాస్‌పై ఎడాపెడా ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన మోదీ సర్కారుకు ఎన్నికల వేళ ప్రజలపై ప్రేమ పుట్టుకొచ్చింది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై ఇచ్చే రాయితీని రూ.200 నుంచి రూ.300కు పెంచింది. ఈ మేరకు బుధవారం కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
రాయితీ పెంపు నిర్ణయం ఎన్నికల స్టంట్ అని విపక్షాలు విమర్శించాయి. ఎన్నికల ముందు ధరలు తగ్గించినట్టు నటించడం, తర్వాత వాయించడం బీజేపీ నైజం అని కాంగ్రెస్ నేత అజయ్ కుమార్ విమర్శించారు.