న్యూఢిల్లీ : ప్రతిపక్ష పాలిత రాష్ర్టాల్లో గవర్నర్ల వైఖరి వివాదస్పదమవుతున్నది. ఇటీవలే గవర్నర్ తమిళిసై వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. తాజాగా తమిళనాడు, పంజాబ్ ప్రభుత్వాలు కూడా అదే బాటలో నడిచాయి. తమిళనాడు గవర్నర్ రవి రాజకీయ ప్రత్యర్థిలా వ్యవహరిస్తున్నారని, బిల్లుల ఆమోదంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది.
ప్రభుత్వ బిల్లులతోపాటు, నియామక ఉత్తర్వులు, అవినీతికి పాల్పడ్డ మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలకు చేసిన సిఫార్సులు, రోజువారీ ఫైళ్లు, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు.. ఇలా వేటిపై కూడా గవర్నర్ సంతకం చేయకుండా రాజకీయ ప్రత్యర్థిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని, ప్రభుత్వం పంపిన ఫైళ్లను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా ఆదేశాలివ్వాలని కోరింది. మరోవైపు పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌పై కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌లోని అంశాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు.