మంగళవారం 26 జనవరి 2021
National - Jan 07, 2021 , 08:47:57

సిగ‌రెట్ తాగాలంటే ఎంత‌ వ‌య‌సు ఉండాలో తెలుసా?

సిగ‌రెట్ తాగాలంటే ఎంత‌ వ‌య‌సు ఉండాలో తెలుసా?

న్యూఢిల్లీ :  ధూమ‌పానం ఆరోగ్యానికి హానికరం అని నోరు పోయేలా మొత్తుకున్న‌, దాని వ‌ల్ల క‌లిగే దుష్ర్ప‌భావాల‌ను ప్ర‌క‌ట‌న‌ల రూపంలో తెలియ‌జేసినా... కుర్రాళ్లు అస్సలు వినట్లేదు. మరీ దారుణమేంటంటే... స్కూల్ విద్యార్థులు కూడా సిగరెట్లు, గుట్కాల వంటివి లాగించేస్తున్నారు. వీట‌న్నింటిని దృష్టిలో పెట్టుకున్న‌ కేంద్రం... సిగ‌రెట్ తాగే వారిప‌ట్ల‌ కండీషన్లను మరింత కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్రం సిద్ధం చేసింది.

బిల్లులోని మూఖ్యాంశాలు :

- హోట‌ళ్ల‌లో సిగ‌రెట్లు బంద్‌!

- విడి సిగరెట్ల విక్రయం నిషేధం

- పొగత్రాగడం కోసం రెస్టారెంట్లు, విమానాశ్రయాల్లో ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న ప్రత్యేక గదులు, స్థలాల  మూసివేత

- పొగ త్రాగడానికి ప్రస్తుతం ఉన్న కనీస వయసు 18 ఏండ్లను 21 ఏండ్లకు పెంపు

- 21 ఏండ్లు నిండని వారికి సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను అమ్మడం నేరం. నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.లక్ష జరిమానాతో పాటు ఏడేండ్ల జైలు శిక్ష విధిస్తారు.

- విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు జరుపకూడదు.


logo