Helmet | ద్విచక్ర వాహన తయారీదారులకు (two-wheeler manufacturers) కేంద్రం కీలక సూచన చేసింది. వాహనం కొనుగోలు సమయంలో రెండు హెల్మెట్ (Two Helmets)లను అందించడం తప్పనిసరి చేసింది. ఈ కొత్తనియమాన్ని అమల్లోకి తీసుకురావడానికి రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ కేంద్ర మెటారు వాహనాల నిబంధనలు 1989కి ముఖ్య సరవరణలను ప్రతిపాదిస్తూ ముసాయిదా విడుదల చేసింది. జూన్ 23, 2025న ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం.. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన మూడో నెల నుంచి ద్విచక్ర వాహన తయారీదారులు, కొనుగోలు దారులకు రెండు హెల్మెట్లను అందించాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (Bureau of Indian Standards) సూచించిన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా తయారు చేసిన హెల్మెట్లనే కొనుగోలుదారులకు అందించాల్సి ఉంటుంది.
అదేవిధంగా ఇంజిన్ సామర్థ్యంతో సంబంధం లేకుండా వచ్చే ఏడాది జనవరి నుంచి తయారయ్యే అన్ని ద్విచక్ర వాహనాలకు యాంటీ-లాక్ బ్రేకింగ్ వ్యవస్థను (Anti-lock Braking Systems) తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణికుడి భద్రత కోసం దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. ఆకస్మికంగా బ్రేక్ వేసినప్పుడు చక్రాలు లాక్ అవ్వకుండా నిరోధించడానికి, జారిపోయే, క్రాష్ అయ్యే ప్రమాదాన్ని తగ్గించడానికి యాంటీ-లాక్ బ్రేకింగ్ వ్యవస్థ దోహదపడుతుంది. అలాగే ద్విచక్ర వాహనం కొనుగోలు సమయంలో వాహన తయారీదారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సూచించిన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా రెండు రక్షణ శిరస్ర్తాణాలను సరఫరా చేస్తారని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది.
Also Read..
Kolkata law college | లా స్టూడెంట్‌పై గ్యాంగ్‌రేప్.. కాలేజీ సెక్యూరిటీ గార్డు అరెస్ట్
Operation Sindhu | ఆపరేషన్ సింధు ద్వారా 4,415 మంది భారతీయుల్ని తరలించాం : కేంద్రం
Rath Yatra | పూరీ జగన్నాథుడి రథయాత్రలో 600 మందికి అస్వస్థత