Kolkata law college | ఆర్జీకర్ హత్యాచార ఘటనను మరువక ముందే పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెండ్లికి నిరాకరించిందన్న అక్కసుతో కోల్కతా న్యాయ కళాశాలకు (Kolkata law college) చెందిన 24 ఏండ్ల విద్యార్థినిపై అదే కళాశాల పూర్వ విద్యార్థి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విద్యార్థి విభాగం నాయకుడు మరో ఇద్దరు విద్యార్థులతో కలసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో అరెస్ట్ జరిగింది.
సౌత్ కోల్కతా లా కాలేజీ సెక్యూరిటీ గార్డు (security guard)ను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అధికార టీఎంసీ విద్యార్థి విభాగం నాయకుడితోపాటు మరో ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూన్ 15న సెక్యూరిటీ గార్డు గదిలో బాధితురాలిపై దాడి జరిగినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కళాశాల ప్రధాన గేటుకు తాళం వేసిన తర్వాత సెక్యూరిటీ గార్డు గది బయటే ఉన్నట్లు బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read..
Operation Sindhu | ఆపరేషన్ సింధు ద్వారా 4,415 మంది భారతీయుల్ని తరలించాం : కేంద్రం
Ayodhya Ram Temple: రామ్లల్లాను దర్శించుకున్న 5.5 కోట్ల మంది భక్తులు