అయోధ్య: అయోధ్యలో రామాలయ నిర్మాణం(Ayodhya Ram Temple) తర్వాత అక్కడకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. 2024, జనవరి 22వ తేదీన కొత్తగా నిర్మించిన ఆలయాన్ని ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆనాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 5.5 కోట్ల మంది భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. సాధారణ ప్రజలే కాదు.. వీఐపీలు కూడా అధిక సంఖ్యలో రామ్లల్లాను దర్శించుకున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సీఎంలతో సహా సుమారు 4.5 లక్షల మంది వీఐపీలు అయోధ్య రాముడిని దర్శించుకున్నట్లు ప్రకటనలో తెలిపారు.
అయోధ్య పునర్ నిర్మాణం తర్వాత ఆలయంలో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా ఆయోధ్య తయారైంది. రాముడి ప్రతిష్ట తర్వాత ఇప్పటి వరకు 5.5 కోట్ల మంది భక్తులు ఆయోధ్యకు వచ్చినట్లు డివిజినల్ కమీషనర్ గౌరవ్ దయాల్ తెలిపారు. ఆలయంలోని ఫస్ట్ ఫ్లోర్లో రామ్దర్బార్ను ఓపెన్ చేయడం వల్ల భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.