తిరువనంతపురం : కరోనా బారినపడి తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు కేరళ ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తున్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తెలిపారు. వీరికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి తక్షణ సాయంగా ఒక్కొక్కరికీ రూ. 3 లక్షలు అందించనున్నట్లు వెల్లడించారు. పిల్లలకు 18 ఏండ్లు వచ్చేంత వరకు నెలకు రూ. 2 వేల చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పారు. డిగ్రీ వరకు చదువుకునేందుకు అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం పినరయ్ విజయస్ ప్రకటించారు. ఈ మేరకు తన అధికార ట్విట్టర్ ఖాతాలో ఆయన ఈ వివరాలను జోడిస్తూ ట్వీట్ చేశారు.
We will provide a special package for children who have lost their parents to #Covid19. ₹3,00,000 will be given as immediate relief and a monthly sum of ₹2,000 will be issued till their 18th birthday. GoK will cover educational expenses till graduation.
— Pinarayi Vijayan (@vijayanpinarayi) May 27, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.