Delhi Minister : దేశానికి స్వాతంత్య్రం లభించిన అనంతరం ఎన్నికైన ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని జైలులో పెట్టడం ఇదే తొలిసారని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత గోపాల్ రాయ్ అన్నారు. ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను జైల్లో నిర్బంధించడంతో ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారని, ఇది సానుకూల చర్యని ఆయన పేర్కొన్నారు.
కాగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధునిక స్వాతంత్ర సమరయోధుడని ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్ అభివర్ణించడాన్ని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఎద్దేవా చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గెహ్లాట్ రాజకీయ ప్రసంగం చేశారని దుయ్యబట్టారు. గెహ్లాట్ తీరు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్ధలను అవమానించేలా ఉందని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌ను మొఘల్ పాలకుడు నదీర్ షాతో పోల్చడం సమంజసమని వీరేంద్ర సచ్‌దేవా ఎద్దేవా చేశారు.
అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను కైలాష్ గెహ్లాట్ ప్రశంసిస్తూ ప్రసంగించడం చూస్తేంటే ఆయన స్వాతంత్య్ర వేడుకలను ఉద్దేశించి కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినట్టు ఉందని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా అన్నారు.స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కైలాష్ గెహ్లాట్ పాత విద్యుత్, మంచినీటి పధకాల గురించి ప్రస్తావించినా, కేజ్రీవాల్‌ను నిలువరించేందుకు జాతి వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించినా ఆయన ప్రసంగం అంతా రాజకీయ ప్రచారంలానే సాగిందని దుయ్యబట్టారు.
Read More :
PM Modi | బంగ్లాదేశ్‌లో హిందువుల, మైనారిటీల భద్రతపై 140 కోట్ల మంది భారతీయుల ఆందోళన : పీఎం మోదీ