Electricity | న్యూఢిల్లీ: టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ విద్యుత్తు వినియోగం భారీ స్థాయికి చేరుకుంది. 2023లో ఈ రెండు కంపెనీలు 24 టెరావాట్ అవర్ విద్యుత్తును వినియోగించాయని తేలింది. దాదాపు 100కు పైగా దేశాలను మించి ఈ కంపెనీలు విద్యుత్తు వినియోగిస్తున్నట్టు వెల్లడైంది.
ఆ రెండు కంపెనీలు మొత్తం 48 టెరావాట్ అవర్ విద్యుత్తును వాడుతున్నాయని, దీనివల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం ఏర్పడుతున్నదని, కర్బన ఉద్గారాలు పెరగడానికి దారితీస్తున్నదని విమర్శలున్నాయి. టెక్ కంపెనీల డాటా సెంటర్లు, ఏఐ, క్లౌడ్ సర్వీసెస్ నుంచి పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతున్నదనే ఆరోపణలున్నాయి.