Advance Booking | న్యూఢిల్లీ, నవంబర్ 1: రైలు టికెట్ల రిజర్వేషన్లలో చేపట్టిన ప్రధాన మార్పు దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. గతంలో ఉన్న ముందస్తు రిజర్వేషన్ వ్యవధిని 120 నుంచి 60 రోజులకు తగ్గిస్తూ రైల్వే అక్టోబర్ 16న ప్రకటన చేసింది.
ఆ మార్పు నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ మార్పు శుక్రవారం నుంచి రిజర్వేషన్లు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. గతంలో 60 రోజుల ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారు యథావిధిగా తమ టికెట్లను వినియోగించుకోవచ్చు.