భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామం పలు గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలిచింది. మద్యం, డబ్బుకు ఆశపడకుండా గ్రామాభివృద్ధికి కృషి చేసే వారికి సర్పంచ్ పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది. ఇందుకు ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. సర్పంచ్ పదవిని వేలం వేయాలని నిర్ణయించారు. దాంతో వచ్చిన డబ్బుతో గ్రామాన్ని బాగు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆ గ్రామ సర్పంచ్ పదవి రూ. 44 లక్షల వేలం పలికింది.
మధ్యప్రదేశ్‌లో వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అశోక్‌నగర్ జిల్లాలోని భటౌలీ గ్రామ పంచాయతీ ఓ తీర్మానం చేసుకున్నది. సర్పంచ్ పదవిని వేలం వేయాలని నిర్ణయించింది. సర్పంచ్ పదవికి పోటీ పడేవారు వేలంలో పాల్గొనాలని గ్రామస్తులు నిర్ణయించారు. దీంతో వేలం పాట రూ. 21 లక్షలతో ప్రారంభమై.. రూ. 43 లక్షలకు చేరింది. చివరగా సౌభాగ్ సింగ్ యాదవ్ రూ. 44 లక్షలతో సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నాడు. అనంతరం సింగ్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపి.. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇక యాదవ్‌కు వ్యతిరేకంగా ఎవరూ కూడా నామినేషన్ దాఖలు చేయొద్దని ఆదేశించారు. నామినేషన్ దాఖలు చేసే సమయానికి గ్రామానికి రూ. 44 లక్షలు చెల్లించడంలో యాదవ్ విఫలమైతే.. ఆయన తర్వాతి స్థానంలో ఉన్న వ్యక్తి సర్పంచ్ పదవికి పోటీ చేసే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Sarpanch On Auction-villagers of Bhatauli in Madhya Pradesh Elects Saubhag Singh Yadav as the sarpanch after he shelled out Rs 44 lakhs for the election, defeating four other contenders for the post in bidding! @ndtv @ndtvindia pic.twitter.com/tIeFpMSrak
— Anurag Dwary (@Anurag_Dwary) December 16, 2021