అనంత్‌నాగ్: పర్యావరణ పరిరక్షణ కోసం జమ్ముకశ్మీర్‌కు చెందిన ఓ సర్పంచ్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. పాలిథీన్ వ్యర్థాలు అందజేస్తే.. బదులుగా బంగారు నాణేలు ఇస్తున్నారు. అనంత్‌నాగ్ జిల్లాలోని సదివార గ్రామ సర్పంచ్ ఫారుఖ్ అహ్మద్ గనాయి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
20 క్వింటాళ్ల పాలిథీన్ వ్యర్థాలు తీసుకొచ్చిన వారికి ఒక బంగారు నాణెం ఇస్తున్నట్టు గనాయి తెలిపారు. కొద్ది మొత్తంలో తెచ్చిన వారికి కూడా వెండి నాణెం లేదా చిన్న రివార్డు అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇతర గ్రామాల్లోనూ ఈ విధానం అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం యోచిస్తున్నది.