Customs Duty | హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): బంగారం, వజ్రాలు, ప్లాటినమ్ వంటి ఖరీదైన ఆభరణాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలన్న డిమాండ్‌తో కేంద్రం ఎట్టకేలకు ఆ దిశగా చర్యలు చేపట్టింది. బంగారం, వెండి వస్తువులు, కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. ప్లాటినమ్, పల్లాడియమ్, ఓస్మియుమ్, రుథేనియం, ఇరీడియంపై 15.4 శాతం ఉన్న సుంకాన్ని 6.4 శాతానికి కుదించింది. మొబైల్స్, ఛార్జర్లపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి తగ్గించడంతో వాటి ధరలు కూడా తగ్గనున్నాయి.