IPS Officer | గోవా నైట్ క్లబ్లో మహిళ పట్ల అసభ్యకర ప్రవర్తన.. ఐపీఎస్ అధికారిపై వేటు వేసిన కేంద్ర హోంశాఖ
IPS Officer | శాంతి భద్రతలను కాపాడాల్సిన ఓ ఐపీఎస్ అధికారి (IPS Officer) నైట్ క్లబ్ (Night Club)లో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం తీవ్ర కలకలం రేపింది. ఆ అధికారిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం కాస్తా అసెంబ్లీ దాకా వెళ్లింది. దీంతో ఘటనపై స్పందించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ( Ministry of Home Affairs).. చర్యలకు ఉపక్రమించింది.
IPS Officer | శాంతి భద్రతలను కాపాడాల్సిన ఓ ఐపీఎస్ అధికారి (IPS Officer) నైట్ క్లబ్ (Night Club)లో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం తీవ్ర కలకలం రేపింది. ఆ అధికారిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం కాస్తా అసెంబ్లీ దాకా వెళ్లింది. దీంతో ఘటనపై స్పందించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ( Ministry of Home Affairs).. చర్యలకు ఉపక్రమించింది. సదరు ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
2009 బ్యాచ్ ఏజీఎంయూటీ కేడర్ (AGMUT Cadre) ఐపీఎస్ అధికారి ఎ. కోవన్ గోవా (Goa) లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత వారం అక్కడి నైట్ క్లబ్‌కు వెళ్లిన కోవన్.. ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఈ అంశాన్ని గోవా ఫార్వార్డ్ పార్టీ (Goa Forward Party )కి చెందిన ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్ (Vijai Sardesai) అసెంబ్లీలో లేవనెత్తారు. దీంతో వేధింపులకు పాల్పడిన అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఘటనపై విచారణ జరిపిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ నివేదికను కేంద్ర హోంశాఖకు అందజేసింది.
ఆ నివేదికలో సదరు ఐపీఎస్ అధికారిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో కేంద్ర హోంశాఖ శాఖాపరమైన చర్యలు తీసుకుంది. ఆ అధికారిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్డర్లు పాస్ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. సదరు అధికారిని గోవా పోలీస్ హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేస్తున్నట్లు పేర్కొంది. ముందస్తు సమాచారం లేకుండా అక్కడినుంచి వెళ్లొద్దంటూ ఆదేశించింది.
Also Read..
Kochi Mall | బుర్ఖా ధరించి మహిళల వాష్‌రూమ్‌లోకి ప్రవేశించిన వ్యక్తి.. వీడియో రికార్డు చేస్తూ..
Jailer Movie | రజినీ కావాలయ్యా పాటకు జపాన్ అంబాసిడర్ స్టెప్పులు.. వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

